శ్రీశైలంలో చిరుత కలకలం.. ఏకంగా దేవాలయం ఏఈవో ఇంట్లో దూరి కుక్క పై దాడి..

by Mahesh |
శ్రీశైలంలో చిరుత కలకలం.. ఏకంగా దేవాలయం ఏఈవో ఇంట్లో దూరి కుక్క పై దాడి..
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పుణ్యక్షేత్రం లో మరోసారి చిరుత సంచారం కలకలం రేగింది. పాతాళగంగ మార్గంలో సంచరించిన చిరుత.. ఏకంగా దేవాలయం ఈవో ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వెళ్ళింది. అనంతరం అక్కడే ఉన్న కుక్కపై దాడి చేసి దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన సంఘటన మోహన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం డ్యాం గేట్లు ఎత్తడంతో భారీగా సందర్శకులు, భక్తులు శ్రీశైలానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఆటవీ మార్గంలోని ప్రధాన రహదారిపై అటవీ, పోలీస్ అధికారులు భారీ గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో చిరత ఏకంగా పాతాళగంగ మార్గంలో దర్శనమివ్వడం ఆందోళనకర విషయమని అంటున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత ఆనవాళ్లను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story