- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఎన్నికల రోజే దేహదారుఢ్య పరీక్షలా!
దిశ, డోన్: ఎమ్మెల్సీ ఎన్నికల రోజునే కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే మహారాజ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయడం కోసమేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల రోజునే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఈ ఎన్నికల కోసం పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటు కోసం అప్లై చేశారని తెలిపారు. దాదాపు 13 లక్షలకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీకి ఉన్న ఓటమి భయం దీని ద్వారా తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని వడ్డే మహారాజ్ కోరారు.