done: వలసల గ్రామానికి అగ్రికల్చర్ కరెంట్ మంజూరు

by srinivas |
done: వలసల గ్రామానికి అగ్రికల్చర్ కరెంట్ మంజూరు
X

దిశ, డోన్: వలసల గ్రామానికి అగ్రికల్చర్ కరెంటు 52 లక్షల రూపాయలతో మంజూరు అయిందని ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ రాజ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కాలం నుంచి వలసల గ్రామానికి అగ్రికల్చర్ కరెంటు లేదని గుర్తు చేశారు. అటువంటిది మంత్రి బుగ్గన చొరవతో గుంతకల్ రైల్వే అధికారులతో మాట్లాడి వలసల గ్రామ రైతులకు, చిన్న మల్కాపురం కొంతభాగంలో ఉన్న రైతులకు అగ్రికల్చర్ కరెంట్‌ని మంజూరు చేయించారని తెలిపారు. చిన్న మల్కాపురం రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ క్రింద కరెంటు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కరెంటు రావడం వలన దాదాపు 150 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story