Ap News: గగన తలంపై అద్భుతం

by srinivas |   ( Updated:2023-03-01 16:57:24.0  )
Ap News: గగన తలంపై అద్భుతం
X
  • ఒకే కక్ష్యపై గురు, శుక్ర గ్రహాలు
  • ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు

దిశ, కర్నూలు ప్రతినిధి: నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలోని గగన తలంపై అద్భుతం ఆవిష్కృతమైంది. గగన తలంలో ఒక వైపు చంద్రుడు దర్శనమిస్తుంటే మరో వైపు పశ్చిమాన సూర్యాస్తమయం తర్వాత గంట వ్యవధిలో రెండు నక్షత్రాలు వెలిశాయి. వెలసిన రెండు నక్షత్రాలు సౌర కుటుంబంలోని గురు, శుక్ర గ్రహాలుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ అరుదైన ఘటన సీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాకు పశ్చిమాన చోటు చేసుకుంది. భూమి నుంచి చూస్తే ఈ రెండు గ్రహాలు పక్క పక్కనే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో వాటి కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్య చంద్రుల తర్వాత అత్యంత ప్రకాశవంతంగా శుక్ర గ్రహం భూమికి అత్యంత సమీపంలో ఉండడంతో భూమిపై నుంచి వీక్షించే వారికి ఈ రెండు గ్రహాలు దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు, యువకులు ఈ ఖాగోళ దృశ్యాన్ని సాధారణ కంటి చూపుతో తిలకించారు.

Advertisement

Next Story

Most Viewed