Vijayawada: తొలిసారి మహిళ బహిష్కరణ

by srinivas |   ( Updated:2023-04-23 10:52:22.0  )
Vijayawada: తొలిసారి మహిళ బహిష్కరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేయడంతో పాటు గంజాయిని ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు గంజాయి అమ్ముతూ దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గంజాయి విక్రయిస్తున్న మహిళపై విజయవాడ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న సారమ్మ అనే మహిళకు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా నగర బహిష్కరణ విధించారు. సారమ్మపై అజిత్‌సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో 13 కేసులు నమోదు అయ్యాయి.

కొంతకాలంగా ఆమె అజిత్‌సింగ్ నగర్ కేంద్రంగా గంజాయిని విక్రయిస్తున్నారు. ఇప్పటికే 13 కేసులు నమోదు కావడంతోపాటు పోలీసులు స్వయంగా వెళ్లి పలుమార్లు హెచ్చరించినప్పటికీ సారమ్మలో ఎలాంటి మార్పులు రాలేదు. దీంతో సీపీ క్రాంతి రాణా టాటా ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. ఇప్పటివరకు కేవలం రౌడీషీటర్లకే నగర బహిష్కరణ విధించిన పోలీసులు... తొలిసారిగా గంజాయి విక్రయదారులపై నగర బహిష్కరణ వేటు వేస్తూ సంచలనం సృష్టించారు.

Advertisement

Next Story

Most Viewed