- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: మళ్లీ సీఎం వద్దకు మైలవరం పంచాయితీ..
- సీఎంవో అధికారులతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మైలవరం పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య అసలు పొసగడం లేదు. సమన్వయంతో పని చేయాల్సిన నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సీఎం సర్ది చెప్పినా వీరు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. కొద్దిరోజులు స్తబ్ధుగా కనిపించినా రెండుల క్రితం జరిగిన కార్యక్రమంలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జోగిరమేశ్ రమేశ్ మధ్య ఆధిపత్య పోరు మళ్లీ మొదలైంది. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగి రమేశ్ కలుగజేసుకోవడం వసంత కృష్ణప్రసాద్‌కు ఎంతమాత్రం నచ్చడంలేదు. దీంతో జోగిరమేశ్, వసంత కృష్ణ ప్రసాద్ నువ్వెంతంటే నువ్వెంత అని అనుకునే పరిస్థితికి వచ్చారు.
తాజాగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో వసంతకృష్ణ ప్రసాద్, జోగిరమేశ్ అనుచరులు బాహాబాహీకి దిగారు. దీంతో వీరి మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పుడు కూడా ఈ పంచాయితీ సీఎం జగన్ వద్దకు చేరింది. సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ వెళ్లారు. ముందుగా సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం సీఎం జగన్‌తో సైతం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.