- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: మూడు రోజుల్లో ఖాతాల్లోకి నిధులు
దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది. తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించింది. వాస్తవానికి తిరువూరులో ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సభ జరగాల్సి ఉండగా సభావేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యటనను 19కి వాయిదా వేశారు.
కాగా రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ తదితర కోర్సుల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నారు. ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలో నాలుగు విడతలుగా అందజేస్తున్నారు. తాజాగా కూడా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.