- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచారణకు సహకరించని సజ్జల.. మంగళగిరి సీఐ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం(Telugu Desam Party National Office)పై దాడి కేసులో YSRCP సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)ని మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్(Mangalagiri Rural Police Station)లో పోలీసులు విచారించారు. గంటన్నరపాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం సజ్జల అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే విచారణలో సజ్జలను ఫోన్ అడిగితే ఇవ్వలేదని మంగళగిరి గ్రామీణ పీఎస్ సీఐ శ్రీనివాసరావు(CI Srinivasa Rao) వెల్లడించారు. సజ్జలను మొత్తం 38 ప్రశ్నలు అడిగినట్లు ఆయన చెప్పారు. అందులో చాలా వాటిని సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కొన్ని విషయాలు తనకు గుర్తులేదని, కొన్నింటితో అసలు సంబంధం లేదని సజ్జల చెప్పినట్లు స్పష్టం చేశారు. తమ వద్ద ఆధారాలున్నాయని, ఈ మేరకే సజ్జలను విచారించామని మంగళగిరి గ్రామీణ పీఎస్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.