Janasena: అవనిగడ్డ ఘటనపై ఆగ్రహం.. జనసేన లేఖ విడుదల

by srinivas |   ( Updated:2023-10-20 13:08:32.0  )
Janasena: అవనిగడ్డ ఘటనపై ఆగ్రహం.. జనసేన లేఖ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: అవనిగడ్డలో జనసేన వీరమహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే దాడికి తెగబడతారా అని ఆయన ప్రశ్నించారు. అవనిగడ్డలో జనసైనికులు, వీర మహిళలపై చేసిన దాడి అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రి హామీలు అమలు చేయాలని కోరుతూ జనసేన-టీడీపీ మహాధర్నాకు పిలుపునిచ్చారన్న అక్కసుతో జనసైనికులు, వీర మహిళలపై పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులు దాడికి తెగబడటం అప్రస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయమని గుర్తు చేస్తే వైసీపీ పాలకులు, ప్రజా ప్రతినిధులు అసహనంతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రవర్తించిన తీరు చూస్తే ప్రజల పట్ల ఎంత బాధ్యతారాహిత్యంతో ఉన్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే రోడ్డెక్కి జనసైనికులు, వీర మహిళలపై దాడి పాల్పడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో పలువురు వీర మహిళలు గాయపడ్డారని.. వారికి చికిత్స అందించకుండా అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తిప్పడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి సీఎం జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటిని అమలు చేయాలని కచ్చితంగా నిలదీస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ మనోహర్ హెచ్చరించారు.



Advertisement

Next Story

Most Viewed