Mla Kodali: పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నట్టా..?. లేనట్టా..?

by srinivas |   ( Updated:2023-11-04 11:15:13.0  )
Mla Kodali: పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నట్టా..?. లేనట్టా..?
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వ్యవహారంలో కేంద్రానికి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆమెపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తొలుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి బెయిల్ విషయంపై పురంధేశ్వరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీంతో పురంధేశ్వరిపై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నట్టా..?. లేనట్టా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారా?.. టీడీపీలో ఉన్నారా అని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడంలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.


తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తోందని కొడాలి నాని తెలిపారు. బీఆర్ఎస్‌తో పోరాడుతున్నామంటున్న బీజేపీకి కాకుండా చంద్రబాబుకు పురంధేశ్వరి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అంటే కాంగ్రెసే కదా అని, మరి పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నట్టా..? లేక టీడీపీలో ఉన్నట్టా..?. లేక బీజేపీలో ఉన్నట్టా అన్నది బీజేపీ నేతలే అర్థం చేసుకోవాలని సూచించారు. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పోడిచారని, కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి పదవి అనుభవించి ఆ పార్టీకి అధికారం పోగానే బీజేపీలో చేరారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలతో పురంధేశ్వరి బీజేపీలో చేరారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి పురంధేశ్వరి రాసిన లేఖతో ఇక్కడ ఎవరూ భయపడటం లేదన్నారు. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిపై రాజకీయ కక్షతోనే టీడీపీ, కాంగ్రెస్ కేసులు పెట్టాయని కొడాలి నాని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed