Vijayawada: సీఎం జగన్‌పై ట్వీట్.. అరెస్ట్

by srinivas |   ( Updated:2023-03-30 12:21:46.0  )
Vijayawada: సీఎం జగన్‌పై ట్వీట్.. అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై అసభ్యంగా పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరానికి చెందిన కోటిరత్నం అంజన్ ఇటీవలకాలంలో యూఎస్ నుంచి వచ్చారు. అయితే సీఎం జగన్‌పై కోటిరత్నం అంజన్ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు.. పూర్తి ఆధారాలు సేకరించారు. అనంతరం కోటిరత్నం అంజన్‌ను అరెస్ట్ చేసి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నారు.

అయితే కోటిరత్నం కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు కోటిరత్నం అంజన్‌ ఎక్కడ ఉన్నాడో తెలియడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అంజన్ అరెస్ట్‌ను టీడీపీ నేతలు ఖండించారు. రాత్రి సమయంలో అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అంజన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story