Vallabhaneni Vamsi: చంద్రబాబు పెద్ద సైకో.. లోకేశ్ పిల్ల సైకో..!

by srinivas |
Vallabhaneni Vamsi: చంద్రబాబు పెద్ద సైకో.. లోకేశ్ పిల్ల సైకో..!
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైకో అన్న చంద్రబాబు, లోకేశ్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పెద్ద సైకో అని, లోకేశ్ చిన్న సైకో అని అభివర్ణించారు. సంకల్పసిద్ది మార్ట్ మోసం వ్యవహారంలో కూడా తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. లోకేశ్ ఆధ్వర్యంలో నడిచే I TDPనే తనపై ట్రోల్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పకోడి గాళ్లంతా గన్నవరంలో తనకు డిపాజిట్ రాకుండా చేస్తామని అంటున్నారని వల్లభవనేని వంశీ ధ్వజమెత్తారు.

కాగా వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. అప్పటి నుంచి వల్లభనేని వంశీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సంకల్ప సిద్ది మోసంలో వల్లభనేని వంశీ పాత్ర కూడా టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఆయన కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Advertisement

Next Story