- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల తర్వాత జగన్ భారీ ప్లాన్... తెలిస్తే షాకే...!
దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికల తర్వాత జగన్ లండన్‌కు జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఎద్దేవా చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రూ.500 కోట్లు ఖర్చు చేసి విశాఖలోని రుషికొండను బోడిగుండు చేసి ఆ స్థానంలో ఓ గొప్ప ప్యాలెస్ నిర్మించుకున్నారన్నారు. కొద్దిరోజుల్లో వైజాగ్‌లో క్యాంప్ ఆఫీస్ పేరిట జగన్ ఆ ప్యాలెస్‌లో ఫ్యామిలీని పెట్టనున్నారని, జగన్ కుటుంబం రుషికొండ ప్యాలెస్‌కు త్వరలో వెళ్లబోతోందన్నారు. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానాన్ని వైజాగ్ నుంచి వెళ్లేలా మార్చుకున్నారని దుయ్యబట్టారు. హూ కిల్డ్ బాబాయి అని జనం హోరెత్తిస్తుంటే జగన్ మాత్రం మౌనం పాటిస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్టు బయటికి రాలేదన్నారు. కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు గానీ ప్రజా కోర్టు నుంచి జగన్, అవినాష్ రెడ్డి లాంటివారు తప్పించుకోలేరన్నారు. కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారని, మహిళల పుస్తెల తాళ్లు తెంచిన జగన్‌కు పుట్టగతులుండవన్నారు. 2024లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని, ఆ సంగ్రామంలో టీడీపీదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి రైతుల అగచాట్లు
జగన్ అఘాయిత్యాలతో అమరావతి రైతులు అగచాట్లు పడుతున్నారని మాజీ మంత్రి అన్నారు. అమరావతి రైతులు కొంతమంది జైళ్లకెళ్లగా..మరికొంతమంది గుండెపోటుతో ప్రాణాలర్పించారన్నారు. ప్రభుత్వ భవనాలను, సచివాలయాలను తాకట్టు పెట్టే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి జగన్ ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు రూ.68 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులెత్తించారని, పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. జగన్ చాలా ప్రాజెక్టులను పడకేయించారన్నారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రయివేట్ భూములు ఇలా తాకట్టు పెడుతూ పోతున్నారని దుయ్యబట్టారు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలతో జనం విలవిలలాడుతున్నారన్నారు. సెంటు పట్టా పేరుతో జగన్ రూ.7 వేల కోట్లు లూటీ చేసింది వాస్తవం కాదా ? అన్నారు. చంద్రబాబు పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయిస్తే, జగన్ ఏం చేశాడని ప్రశ్నించారు. జగన్ నాడు-నేడు పథకంలో రంగులు వేయడం, ప్రహరీలు, మట్టి, ప్లాస్టింగ్ పనుల్లో లూటీ చేశారన్నారు. కోర్టుల్లో కేసులు వేయడానికి వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా రాయలసీమ ద్రోహే కాక రైతాంగ ద్రోహిగా కూడా జగన్ మారారని ఆరోపించారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు ?
ఎవరి ఆస్తులని సచివాలయాన్ని జగన్ తాకట్టు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ ను, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ను, ఇడుపులపాయిలోని ఎస్టేట్ ను, కడపలోని ఎస్టేట్ ను, మద్రాస్, కోయంబత్తూరు సముద్ర తీరాన ఉన్న భవనాలు, బెంగళూరులోని భవనాలను తాకట్టు పెట్టాలి గానీ ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి జగన్ కు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. నవరత్నాల విడుదల సమయంలో, మేనిఫెస్టోలో, పాదయాత్రలో జనాలకు ముద్దులు పెట్టేటప్పుడు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెడతానని చెప్పలేదన్నారు. ఇటీవల వైజాగ్ లో 24 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారో ప్రజలకు తెలపాలన్నారు. చివరకు చెత్తమీద కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం జగన్ దని దుయ్యబట్టారు. ఒక్కొక్కరిపై 8 లక్షల తలసరి అప్పును జగన్ చేశారన్నారు. రాష్ట్ర రాజదాని కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇస్తే..చంద్రబాబు ఆ భూముల్లో సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలు నిర్మించారని గుర్తు చేశారు.