Breaking: ఏపీలో పొత్తులపై బీజేపీ నేతల కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2024-03-02 11:35:40.0  )
Breaking: ఏపీలో పొత్తులపై బీజేపీ నేతల కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: పొత్తులపై ఏపీ బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అధిష్టానం మేరకే పొత్తులుంటాయని.. అగ్రనాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని తీర్మానించారు. విజయవాడలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. శనివారం ఉదయం సమావేశం ప్రారంభంకాగానే రాయలసీమ నేతలతో ఆ పార్టీ నేత శివప్రకాశ్ చర్చించారు. పొత్తులు, పార్టీ బలాబలాలపై తిరుపతి, అనంతపురం, చిత్తూరు, కడప, నంద్యాల జిల్లాలకు చెందిన నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ పొత్తులపై నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరించినట్లు తెలిపారు. పొత్తు పెట్టుకుంటే ఎలా.. ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఎలా అంశంపై ఈ సమావేశంలో చర్చిచామని తెలిపారు. కానీ పొత్తులపై మాత్రం తుది నిర్ణయం అధిష్టానందేని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటేనే మంచిదని ప్రజలు చెబుతున్నారన్నారు. ఈ మీటింగ్ ప్రీ ఫైనల్ లాంటిదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల బలాబలాపై చర్చించామని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

Read More..

ఏపీ రాజకీయాల్లో కీలక ట్విస్ట్.. పవన్ పై పోటీకి సిద్ధమైన కాపు నేత..!

Advertisement

Next Story