ACB COURT: చంద్రబాబుపై పెండింగ్‌ పీటీ వారెంట్లు.. వాదనలు వినిపిస్తున్న ఇరువర్గాలు

by srinivas |   ( Updated:2023-10-09 11:54:33.0  )
ACB COURT: చంద్రబాబుపై పెండింగ్‌ పీటీ వారెంట్లు.. వాదనలు వినిపిస్తున్న ఇరువర్గాలు
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ పీటీ వారెంట్లపై వాదనలు అవసరంలేదని, కోర్టు నిర్ణయమే చాలని సీఐడీ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాది మాత్రం పీటీ వారెంట్లపై వాదనలు వినాల్సిందేనని వాదించారు. ఈ పీటీ వారెంట్లపై సీఐడీ తరపున వివేకానంద, చంద్రబాబు తరపున వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఇన్నర్ రింగు రోడ్డుకు సంబంధించి ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని, అసలు రోడ్డు లేదని, ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేశారని చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నారు. పనులు జరగకపోతే ముందస్తుగా డబ్బులు ఎలా కేటాయించారని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed