- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే వేదికపై కొడాలి నాని, వంగవీటి రాధా
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. పార్టీలు వేరైనప్పటికీ వీరిద్దరి స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఫంక్షన్కు వెళ్లినా ఇక అది సంచలనమే. తాజాగా గుడివాడలో ఓ వివాహ కార్యక్రమానికి వంగవీటి రాధా, మాజీమంత్రి కొడాలి నాని హాజరయ్యారు. గుడి వాడ కే కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కుమార్తె వివాహం జరుగుతుంది. అయితే ఈ వివాహ వేడుకకు తొలుత మాజీమంత్రి కొడాలి నాని చేరుకున్నారు.
మాజీఎమ్మెల్యే వంగవీటి రాధా ఆలస్యంగా రావడంతో అరగంట సేపు బయటే ఉండిపోయారు. ఆ తర్వాత రాధా వచ్చిన అభిమానులు ఆయనను చుట్టిముట్టారు. సెల్ఫీలు దిగారు. ఇదంతా జరుగుతున్న మాజీమంత్రి కొడాలి నాని అలానే ఉన్నారు. సెల్ఫీల కోసం ఎగబడే వారిని మరీ పిలిపించి సెల్ఫీలు ఇప్పించారు. ఇద్దరు స్నేహం చూసి నేతలు చమత్కరించారు. ఇకపోతే కొడాలి నాని వైసీపీలో కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే వంగవీటి రాధా కూడా టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
READ MORE
'చదువులేని వాడు వింత పశువు' అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అచ్చెన్న సెటైర్లు