విద్యార్థులను పరుగు పెట్టించిన కింగ్ కోబ్రా.. ఎక్కడో తెలుసా?

by srinivas |   ( Updated:2024-08-01 13:10:43.0  )
విద్యార్థులను పరుగు పెట్టించిన కింగ్ కోబ్రా.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులను కింగ్ కోబ్రా పరుగులు పెట్టించింది. స్కూలుకు వెళ్లిన విద్యార్థులకు, టీచర్లకు కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారంతా అరుపులు, కేకలతో బయటకు వెళ్లిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకోవడంతో ఊపరి పీల్చుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గురుకుల పాఠశాలలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.... పాతపట్నం గురుకుల పాఠశాల కొండల మధ్య ఉంది. రోజు మాదిరిగానే విద్యార్థులు స్కూలుకు వెళ్లారు. అయితే తరగతి గదిలో 12 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. భయంతో స్కూలు నుంచి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ప్రసాదరావు స్కూలు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాశీబుగ్గలోని ఈస్టెన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందజేశారు. స్నేక్ క్యాచర్ ఓంకార్ కింగ్ కోబ్రాను చాకచక్యంగా బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కింగు కోబ్రా వయసు 2 సంవత్సరాలు ఉంటుందని, దాదాపు 22 అడుగుల వరకూ పొడవు పెరుగుతుందని ఓంకార్ తెలిపారు.

Advertisement

Next Story