- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఒక్క ఇంచు కూడా కదలించలేరని.. తెలుగు రాష్ట్రాల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లగా కలిసి పోరాడుదామని టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ కాంగ్రెస్ విశాఖపట్నంలో భారీ బహిరంగా సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో ఈ సభను చూస్తుంటే.. హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రశ్నించే గొంతుకలు లేవని.. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
ఢిల్లీని డిమాండ్ చేసి రాష్ట్రానికి కావాల్సింది సాధించే నాయకత్వం ఇప్పుడు లేదన్నారు. వైఎస్ ఎంతో పోరాటం చేసి 2004లో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ చేసిన కృషే కారణమని కొనియాడారు. వైఎస్ సంకల్పం నిలబెట్టేవారే వైఎస్ వారసులు అవుతారు.. ఆయన ఆశయాలు మర్చిపోయిన వారు వైఎస్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులు ఉంటేనే ఢిల్లీ పాలకులు మన మాట వింటారని చెప్పారు. ప్రశ్నించే నాయకుడు లేకే మోడీ ఏపీని పట్టించుకోలేదని సంచలన వ్యా్ఖ్యలు చేశారు.
Read More : ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు