- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ మామూలుగా లేదుగ .. ఏపీ సీఎంనే అలా అనేసారు..
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు పల్నాడు జల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో టీడీపీ నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. కార్యాక్రమంలో భాగంగా ప్రస్తావించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలనా, అలానే అరాచక హింస ఉందని ఆరోపించారు. ఆ అరాచక పాలనను, అరాచక హింసను తరిమికొట్టేందుకు తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. దొంగల ముఠా పోలీసుల కాపలాతో రాష్ట్రం పైన పడి దోచుకుతింటోంది అని మండిపడ్డారు. ఈ ప్రజాస్వామ్య రహిత వాతావరణం పోయి ప్రజాస్వామ్యం రావాలనే ఉద్దేశంతోనే.. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి.. ఆంధ్ర రాష్ట్రం కోసం టీడీపీ లో చేరినట్లు పేర్కొన్నారు. జగ్మోహన్ రెడ్డి కూడా తనను వైసీపీలోకి రమ్మని అడినట్లు తెలిపారు.
కానీ ఈ రాక్షస ప్రభుత్వ పాలన చేస్తున్న జగన్ ఒక రాక్షసుడని.. అలాంటి రాక్షసుడు పాలకుడిగా ఉండడానికి వీలు లేదని ధ్వజమెత్తారు. అందుకోసమే తాను తెలుగుదేశం పార్టీ లో చేరినట్లు పలుమార్లు పేర్కొన్నారు. రక్షపాలనను తరిమి కొట్టేందుకు తాను చంద్రబాబు నాయుడుతో కలిసి భుజంభుజం కలిపి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇక రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి అరాచక పాలన జరుగుతోందని.. ఆ అరాచక పాలనను రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా తరిమికొట్టాల్సిందిగా ప్రజలకు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.