- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
36 గంటల్లో ఎన్నికలు..50 వేల ఓట్ల మెజార్టీపై సురేంద్రబాబు కన్ను
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ్టి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో సంచలన హామీలు ఇస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో ఈ సారి మొదటి స్థానం అమిలినేనిదేనని చెబుతున్నారు. దీంతో గెలుపుపై సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 50 వేల మెజార్టీ తనదేని అంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రజలకు అలిమినేని సురేంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. కల్యాణదుర్గం ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. అలా చేస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని సురేంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే తొలుత వలసలను తగ్గిస్తామని, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లను స్వగ్రామాలకు రప్పిస్తామని చెప్పారు. స్థానికంగా కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలిస్తామని, మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీటీపీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి అధిక నిధులు తెప్పించుకుంటామన్నారు. రెండున్నరేళ్లలో పనులు పూర్తి చేసి కల్యాణదుర్గం నియోజవకర్గ ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి తీరుతామన్నారు. కళ్యాణదుర్గాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, స్వచ్ఛతలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వీధులను శుభ్రం చేయిస్తామని, పారిశుధ్యంపై స్పెషల్ ఫోకస్ పెడతామని, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.