- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్యాణదుర్గం టీడీపీలో ముసలం
దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇటీవల జిల్లాలో నారా లోకేష్ పర్యటించిన సందర్భంలో ఇక్కడి వర్గ పోరు ఆయన దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. అయినా, అధిష్టానం మాటలను పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తుంది. కాగా, యువగళం లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పాదయాత్ర చేపట్టాలని పార్టీ అధిష్టానం ఆయా నియోజకవర్గాల ఇన్చార్జి లకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వర్గాలుగా ఉన్న కళ్యాణ దుర్గం టీడీపీ నేతలు వేర్వేరుగా ఆ కార్యక్రమాన్ని చేపడుతుండటం హాట్ టాపిగ్గా మారింది.
వెనక్కి తగ్గని ఇరువర్గాలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కళ్యాణదుర్గంలో నెలకొన్న గ్రూపు తగాదాలతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గం సెట్టూరు మండలం యాటికల్లు నుంచి పాదయాత్ర చేపడుతుంటే , మాజీ ఎమ్మెల్యే గున్నం హనుమంతరావు చౌదరి వర్గీయులు పాపంపల్లి నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇరు వర్గాలు వెనక్కి మాత్రం తగ్గడం లేదు.
మూడేళ్లుగా ఇదే వరస..
గత మూడు సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్య మాత్రం కొలిక్కి రావడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ప్రస్తుతం చేపట్టబోతున్న సంఘీభావ పాదయాత్ర వల్ల పార్టీకి మైలేజ్ పెరగకపోవగా, మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారా లోకేష్ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన సమయంలో కళ్యాణదుర్గం టీడీపీలో నెలకొన్న విభేదాలు ఆయన దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అయినా ఇక్కడి నాయకులు ఎవరికి వారే అన్నట్టు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు.
- Tags
- tdp