KA Paul : పవన్ కళ్యాణ్ పై KA పాల్ ఫైర్

by M.Rajitha |   ( Updated:2025-03-05 15:05:02.0  )
KA Paul : పవన్ కళ్యాణ్ పై KA పాల్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Cheif Pavan Kalyan) పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(KA Paul) మరోసారి మండిపడ్డారు. పవన్ ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టానని చెప్పడం అవాస్తవం అన్నారు. జనసేనకు పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే.. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని, కోట్లు ఖర్చు చేసిన నాయకులను కాదని వాళ్ల అన్న నాగబాబు(Nagababu)కు ఎమ్మెల్సీ ఇచ్చుకుంటున్నాడని మండిపడ్డారు. తాను ఇంతకముందు చెప్పినట్టు.. జనసేన పార్టీ అవినీతిమయం అని, అదొక కుటుంబ పార్టీ అని ప్రజలకు తెలియజేశానని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఇక ఎన్నటికీ మారడని, జనసైనికులు ఇప్పటికైనా ఆ అవినీతి, కుటుంబ పార్టీకి గూడ బై చెప్పి.. అంతా తన ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా జనసేనకు దక్కనున్న ఎమ్మెల్సీ స్థానానికి నాగబాబును ఎంపిక చేస్తారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Next Story