ఏపీలో రేపటితో ముగియనున్న 132 ఉద్యోగాల దరఖాస్తు గడువు.. వెంటనే అప్లై చేసుకోండి

by Seetharam |
ఏపీలో రేపటితో ముగియనున్న 132 ఉద్యోగాల దరఖాస్తు గడువు.. వెంటనే అప్లై చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : చదువు ముగించుకుని జాబ్స్‌కు ట్రై చేస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నోటిఫికేషన్స్‌తో శుభవార్త పలికింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా పోస్టులను భర్తీ చేయనుంది. అందులో కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానంలో టోటల్‌గా 132 పారామెడికల్‌తో పాటు మరికొన్ని పోస్టులను కల్పిస్తోంది. ఇక ఈ పోస్టులపై ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది

పోస్టులు :

రేడియో గ్రాఫర్ 15, జనరల్ డ్యూటీ అటెండెంట్ 36, డైటీషియన్ 01, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు 02, డెంటల్ టెక్నీషియన్ 01, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 02, ల్యాబ్ అటెండెంట్ 04, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 11, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 13, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 06, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 14, ఫిజియో థెరపిస్ట్ పోస్టులు 01, ప్లంబర్ 03, శానిటరీ వర్కర్ కమ్ వాచ్ మెన్ 13, ఓటీ టెక్నీషియన్ 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

క్వాలిఫికేషన్ :

టెన్త్ క్లాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా, ఏవైనా సర్టిఫికెట్ కోర్సులలో అర్హత కలిగి ఉండాలి.

ఏజ్ :

అర్హత కలిగిన అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు పైబడి ఉండకూడదు.

దరఖాస్తు వివరాలు :

దరఖాస్తు ఫీజు రూ. 250 చెల్లించిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం htttp://guntur.ap.gov.in/ వెబ్ సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను డౌన్ లోడ్ చేసుకొని వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఈ ఫారమ్‌‌తో పాటు అవసరమైన సర్టిఫికేట్‌లను జత చేసి, జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. గుంటూరు, గుంటూరు జిల్లా అడ్రస్ కు పంపించాలి. దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ ఆగస్టు 20, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇంకనూ ఏవైనా వివరాల తెలుసుకోవాలనుకుంటే htttp://guntur.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed