- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దశాబ్దాలుగా ఉన్న నేతలకు ఝలక్.. జగన్ వ్యూహం ఇదేనా..!
“ఈ రాజకీయాలు ఇలా ఉండకూడదు. మార్పు రావాలి. నాయకుడు అవసరం లేని సమాజం దిశగా అడుగులు పడాలి..” అంటూ గత ఎన్నికల ముందు వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ గంభీరంగా చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జుల మార్పు చేర్పులను నిశితంగా పరిశీలిస్తే.. తరాల తరబడి నియోజకవర్గాలను శాసిస్తున్న రాజకీయ కుటుంబాల ఆధిపత్యాన్ని పటాపంచలు చేసేట్లు సీఎం జగన్ చర్యలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైర్ అండ్ ఫైర్ మాదిరిగా కార్పొరేట్ స్టైల్ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని నేరుగా ప్రజలు ఎన్నుకునే అధ్యక్ష తరహా పద్దతికి ఇవి తొలి అడుగులని మరికొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
దిశ, ఏపీ బ్యూరో : ఎప్పటినుంచో నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నేతలను వైసీపీ అధిష్టానం ఎడాపెడా మార్చేస్తోంది. ఇప్పటిదాకా ఆరు విడతలుగా 77 నియోజకవర్గాల్లో ఇన్చార్జుల మార్పుచేర్పులు చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా ఎమ్మెల్యేలపైకి తోసెయ్యడం ద్వారా కొంత సానుకూలతను పొందేందుకు అధిష్టానం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని భావించారు. దీని వెనుక సీఎం జగన్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలను ఐదేళ్లకోసారి మార్చెయ్యడం ద్వారా నియోజకవర్గాల్లో వాళ్ల ఆధిపత్యాన్ని జీరో స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఎవర్ని నిలిపినా ప్రజలు అధినాయకుడ్ని చూసి ఓటేసే పద్దతిని తీసుకురావాలనేది జగన్ ఆలోచనల సారాంశంగా చెబుతున్నారు.
తొలి వేటు వారిపైనే..
మార్పు చేర్పులకు సంబంధించి తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల నుంచి మొదలు పెట్టారు. ఆయా నేతల నుంచి తిరుగుబాట్లు పెద్దగా ఉండకపోవచ్చని భావించారు. ఈ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ఆయా నియోజకవర్గాలకు స్థానికులు కాదు. బయట నుంచి వచ్చి పోటీ చేసిన నేతలే ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వీళ్ల నుంచి ఎదురుదాడి అంతగా ఉండకపోవచ్చని భావించారు. ఆ తర్వాత తరాల తరబడి రాజకీయ కుటుంబాలు ఏలుతున్న నియోజకవర్గాల్లోనూ కొన్నింటిని మార్పు చేశారు. అక్కడ తిరుగుబాటు వస్తే కొత్త వాళ్లకు అవకాశమిస్తున్నారు.
జగన్ వ్యూహం వెనుక..
ఈ నిర్ణయాల వల్ల ఎక్కడైనా నష్టం ఎక్కువగా ఉంటుందనుకున్న చోట పార్టీ వెనకడుగు వేస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కొందర్ని జంబ్లింగ్ చేయడం, మరికొన్ని చోట్ల కొత్త వాళ్లకు అవకాశమివ్వడం ద్వారా ఏ ఒక్క నాయకుడు వాళ్ల నియోజకవర్గంలో తనదైన వర్గం ఏర్పాటు చేసుకోకుండా నిరోధించాలనేదే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో బీజేపీ గెలిస్తే..
ఈ దఫా కేంద్రంలో బీజేపీ అధికారానికి వస్తే అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేసే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ముఖ్యమంత్రిని ప్రజలే నేరుగా ఎన్నుకునేట్లు అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు చేయొచ్చు. వీటన్నింటి దృష్ట్యా సీఎం జగన్ ఇలాంటి కార్పొరేట్ స్టైల్ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.