- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బుల్లెట్ బండితో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోజులు..

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సెపరేటు. మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడటం వారి స్టైల్. ఇకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి అయితే మరింత డిఫరెంట్‌గా ఉంటుంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి అకస్మాత్తుగా ట్విటర్ వేదికగా రెండు ఆసక్తికరమైన ఫోటోలు షేర్ చేశారు.
ఫుల్ గెడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలో క్లాసిక్ బండి పక్కన నిల్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అక్కడితో ఆగిపోలేదు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అంతేకాదు తాను యుక్త వయసులో ఉన్నప్పుడు జావా మోటార్ సైకిల్ నడిపేవాడ్నని, అప్పుడప్పుడు ఆనాటి జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.