- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Janasena: పవన్ అన్న మాటల్లో తప్పేముంది..? మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్ట్(Kakinada Port) పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్న మాటల్లో తప్పేముందని పౌర సరఫరాల శాఖమంత్రి(Civil Supply Minister) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. విజయవాడ(Vijayawada)లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. ఎందుకు కాకినాడ పోర్ట్ పైన దృష్టి సారించడం అనేది అందరూ తెలుసుకోవాలని, గత ఐదేళ్లలో ఎవ్వరినీ పోర్టు లోపలికి అనుమతించలేదని తెలిపారు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, అధికారులు ఎవరున్నారు అని తెలుసుకోడానికి మీడియా వారిని కూడా అనుమతించలేదని చెప్పారు. కాకినాడ పోర్టు నుంచి గత మూడేళ్లలో దుర్మార్గంగా.. 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయని స్పష్టం చేశారు.
అలాగే కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు ఇస్తే దాదాపు 6,300 కోట్ల రూపాయల బియ్యం లెక్కలు చూపించి ఇక్కడ నుండి తరలించేశారని, ప్రభుత్వానికి ప్రతి కిలోకి 43.40 రూ ఖర్చయ్యే బియ్యాన్ని వీళ్ళు క్షేత్ర స్థాయిలో 10 రూ"లకే తీసుకుని వెళ్ళిపోడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో తప్పేముందని, దేశ భద్రతను కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. రేపు అక్కడి నుంచి గంజాయి స్మగ్లింగ్ జరగదు అని రూల్ ఉందా ? అని ప్రశ్నించారు. అంతేగాక 2,200 ఎకరాల కాకినాడ పోర్ట్ లో కేవలం 20 మంది పోలీసులను మాత్రమే పెట్టారని తెలిపారు. కాకినాడ పోర్ట్‌ను తన చేతుల్లోకి లాక్కోడానికి జగన్(YS jagan Mohan Reddy) ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారని, కేవీ రావు కుటుంబాన్ని జగన్ ఎందుకు హింసించాడని నిలదీశారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా 41% షేర్లను అరబిందోకి కట్టబెట్టారని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.