ముమ్మిడివరంలో జనసేన షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

by srinivas |
ముమ్మిడివరంలో జనసేన షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక నేతలు నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేనలో కీలకంగా పని చేసిన పితాని బాలకృష్ణతో పాటు డీసీఎమ్ఎస్ మాజీ ఛైర్మన్ సానబోయిన మల్లికార్జున సహా పలువురు జనసేన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆయన ఆశయాలు తమకు నచ్చాయని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌లో పార్టీ చేరామని పితాని బాలకృష్ణ తెలిపారు. పిఠాపురంలో జనసేన కోసం తాము ఎనలేని కృషి చేశామని, అయినా పవన్ కల్యాణ్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని పితాని బాలకృష్ణ పేర్కొన్నారు.

కాగా పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేయాలని పితాని బాలకృష్ణ భావించారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇతరులకు సీటు కేటాయించారు. దీంతో మనస్థాపం చెందిన బాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలకృష్ణు పిఠాపురం జనసైనికులు బుజ్జగించినా ఆయన అసంతృప్తి తగ్గలేదు. శనివారం సీఎం జగన్‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed