- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకాశం జిల్లా వరప్రదాయనిపై పవన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వారాహి విజయభేరిలో ఆయన ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వస్తే వెలిగొండను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానన్న సీఎం జగన్ ఖాళీ సొరంగాలు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందలం ఎక్కితే ప్రజల భవిష్యత్తును చంపేశారు. కూటమి ప్రభుత్వంలో తొలి సంతకం మెగా డీఎస్సీపైనేనని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలపించాలని, ప్రజల కష్టంలో తాను కూడా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే#VarahiVijayaBheri#HelloAP_ByeByeYCP👋 #VoteForNDA☝️#AllianceForABetterFuture✊ pic.twitter.com/llmLS6IPeG
— JanaSena Party (@JanaSenaParty) May 3, 2024