ఆ విషయం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడం లేదు: పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2024-07-15 10:22:35.0  )
ఆ విషయం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడం లేదు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి పదవులను బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు దక్కించుకున్నారు. ప్రస్తుతం పాలనలో చంద్రబాబు సర్కార్ దూసుకుపోతోంది. ఇప్పుడు నామినేటేడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం కూటమి అధిష్టానం కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన అధినేతలపై ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తాము సీటు త్యాగం చేశామని, ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో మూడు పార్టీ అధినేతలు తర్జన భర్జన పడుతున్నారు.

నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో నామినేటెడ్ పదవులకు నాయకుల నియామకం ఉంటుందని, కానీ అందరికీ చైర్మన్ పదవి కావాలంటే కష్టతరమన్నారు. కొందరు టీటీడీ పదవులు కావాలని అడుగుతున్నారని, ఒక్క చైర్మన్ పోస్టు ఉంటే 50 మంది వరకూ ఆశావహులు ఉన్నారని తెలిపారు. తన కుటుంబ సభ్యులెవరూ టీటీడీ చైర్మన్ పదవిని అడగలేదని పవన్ స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబు అడగలేదని, కాని ప్రచారం జరుగుతోందన్నారు. ఇప్పటివరకూ నాగబాబు ఏ పదవి అడగలేదని స్పష్టం చేశారు. ఇంత కాంపిటేషన్‌లో నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబును ఏ విధంగా అలా అడగాలో అర్ధంకావడంలేదన్నారు. పొత్తు పెట్టుకున్నామని, పదవులు మాకివ్వండని అని తాను పట్టుబట్టలేనన్నారు. కేంద్రంలోకి వస్తే కేంద్రమంత్రి పదవులు ఇస్తామని గతంలోనే అడిగారని, కానీ రాష్ట్రానికి సేవ చేస్తామని కేంద్రపెద్దలకు చెప్పామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed