అంధ యువతి హత్యపై Pawan Kalyan ఆగ్రహం.. ప్రభుత్వ ఏం చేస్తోందని మండిపాటు

by srinivas |   ( Updated:2023-02-13 13:27:20.0  )
అంధ యువతి హత్యపై Pawan Kalyan ఆగ్రహం.. ప్రభుత్వ ఏం చేస్తోందని మండిపాటు
X

దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి సీఎం జగన్ నివాసం దగ్గరలో అంధయువతి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం జగన్ నివాసం సమీపంలో ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారిందని పవన్ ఆరోపించారు. గతంలోనూ ఓ రేప్ జరిగిందని.. ఆ నిందితుడిని ఇప్పటి వరకూ పట్టుకోలేదని పవన్ ధ్వజమెత్తారు. తన ఇంటి పరిసరాల పరిస్థితులనే పట్టించుకుంటే ఎలా? అని పవన్ ప్రశ్నించారు. మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆలోచన చేయండి...

దారుణ ఘటనలపై అన్ని వర్గాలు ఆలోచన చేయాలని, తల్లి పెంపకంలోనే లోపం ఉందనే మంత్రులున్న ప్రభుత్వమిది అని పవన్ విమర్శించారు. దొంగతనానికి వచ్చి రేప్ చేశారనే ప్రభుత్వమిదని మండిపడ్డారు. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ మార్చేశారని వ్యాఖ్యానించారు. తాడేపల్లి అంధ యువతి హత్య శాంతి భద్రత వైఫల్యమేనని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అడ్డబిడ్డలకు రక్షణ ఉందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Advertisement

Next Story