ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ: సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ సెటైర్స్

by srinivas |   ( Updated:2024-03-30 15:36:27.0  )
ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ:  సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి‌పై జననసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం చేబ్రోలు నుంచి ‘విజయభేరి’ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ కావాలో.. కూటమి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. తాను పారిపోనని, సమస్యలపై పోరాట చేస్తానని చెప్పారు. తనను ఓడించేందుకు సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనను ఓడించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలానికో నాయకుడిని పెడుతున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే జవాబుదారీ తనమన్నారు. దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధ చేస్తున్నానని తెలిపారు.ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని సెటైర్లు వేశారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నాణ్యత లేని మద్య విక్రయించడం వల్లే చాలా మంది చనిపోయారన్నారు. మద్యంపై వచ్చే ఆదాయం కొంత మొత్తమే ప్రభుత్వానికి వెళ్తోందని, మిగతాదంతా జగన్, ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed