- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
దిశ, వెబ్ డెస్క్: కేంద్రహోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే పవన్ కల్యాణ్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని సమాచారం. మరికొంత మంది బీజేపీ ఆగ్రనేతలతోనూ చర్చించి సీట్ల పంపకంపై మరింత క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో తెలంగాణలో అన్ని పార్టీలు అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తున్నాయి. బీజేపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర నేతలతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.