కడప మాజీ మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

by Seetharam |   ( Updated:2023-09-15 07:03:36.0  )
కడప మాజీ మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు రూ.15వేలు జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారంటూ కడపకు చెందిన పద్మావతి బాయీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారించారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పిటిషనర్ ఇంటిని కూల్చివేసి వైసీపీ నాయకుడి ఇంటికి రోడ్డు వేశారంటూ పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ పద్మావతి బాయీ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే అధికారులు తప్పు చేసారని నిర్ధారణ కావడంతో నాటి మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష‌తో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed