- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Jagan: వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యపై జగన్ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుడు రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. రషీద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతోన్న దాడులపై ప్రధాని మోడీని కలుస్తామని స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితిపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యల, అరాచకాలు పెచ్చుమీరాయని ఫైర్ అయ్యారు. రషీద్ హత్య కేసుపై హై కోర్టులో కేసు వేస్తామన్నారు. నిన్న ఎమ్మెల్యే, ఎంపీలపైనా రాళ్లు రువ్వారని మండిపడ్డారు.