Supreme Courtలో జగన్ ఆస్తుల కేసు.. నిందితుడికి చుక్కెదురు

by srinivas |   ( Updated:2022-12-09 12:18:47.0  )
Supreme Courtలో జగన్ ఆస్తుల కేసు.. నిందితుడికి చుక్కెదురు
X

దిశ వెబ్ డెస్క్: జగన్ ఆక్రమాస్తుల కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. విచారణలో నిందితుడు బ్రహ్మానందరెడ్డికి చుక్కెదురు అయింది. వ్యాన్ పిక్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో సీబీఐ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మారెడ్డిని నిందితుడిగా చేర్చింది. దీంతో తనపై పెట్టిన సీబీఐ కేసును కొట్టివేయాలని నిందితుడు బ్రహ్మానందరెడ్డి ఈ ఏడాది జులైలో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బ్రహ్మానందరెడ్డిపై ఉన్న ఆరోపణలను పరిగణననలోకి తీసుకుని క్వాష్‌ను నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును బ్రహ్మానందరెడ్డి ఆశ్రయించారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని, అలాగే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు జోక్యం చేసుకునే అంశాలు కూడా ఏమీ లేవని తెలిపింది.

Also Read....

రూ.5 కోట్లు అప్పు చేసిన Pawan Kalyan

Advertisement

Next Story