- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీకి ఏటీఎంలా మారిన జగన్ ప్రభుత్వం : మాణికం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి జగన్ ప్రభుత్వం ఏటీఎంలా మారిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, తనపై, పార్టీపై విజయసాయి అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘనేని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనాడు ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడని విజయసాయిరెడ్డి కనీసం సభలో ఆ విషయంపై మాట్లాడలేదని ఆరోపించారు.
బీజేపీ ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ కూడా వంత పాడిందంటూ ధ్వజమెత్తారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు బహిష్కరిస్తే.. ఆయన మాత్రం హాజరయ్యారని గుర్తు చేశారు. బీజేపీ, వైసీపీకి మధ్య లోపాయకారి ఉప్పదం ఉందని ఆ విషయంలో బీజేపీకి జగన్ ప్రభుత్వం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా అమలుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా.. జగన్ సర్కార్ ఉపయోగించుకున్న పాపన పోలేదన్నారు. వ్యక్తిగత సీబీఐ కేసులకే భయపడి సీఎం జగన్ బీజేపీకి సరెండర్ అయ్యారని ఆరోపించారు.