- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివ్యాంగులకు జగన్ తీపికబురు: నియామక, పదోన్నతులలో రిజర్వేషన్
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెం.77 మేరకు ఈ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారిని దివ్యాంగుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని ఆదేశించింది. లబ్ధిదారులు దివ్యాంగుల కమిషన్ వెబ్‌సైట్‌లో తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం, ఏపీపీఎస్సీ సూచించింది.