Breaking: స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకు వస్తుంది.. జగన్

by Indraja |   ( Updated:2024-01-19 15:02:00.0  )
Breaking: స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకు వస్తుంది.. జగన్
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సామాజిక చైతన్యాలవాడగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎలాగైతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందో.. అలానే ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకు వస్తుందని హర్షం వ్యక్తం చేశారు.

అలానే ఇక నిరంతరం పేదల హక్కులకు, రాజ్యాంగ హక్కులకు స్ఫూర్తిదాయకంగా ఈ విగ్రహం నిలుస్తుందని తెలిపారు. దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ గొంతుకగా నిలిచిన మరణం లేని మహానేత అంబేడ్కర్ అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఇక అంటరానితనం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటరానితనాన్ని రూపు మాపాలన్నదే అంబేడ్కర్ ధ్యేయం అని పేర్కొన్న జగన్.. అంటరానితనం అంటే కేవలం తాకకపోవడం కాదు.. ఇంగ్లీష్‌ మీడియం లో పేదవారు చదవొద్దని కోరుకోవడం కూడా అంటరానితనమే అని పేర్కొన్నారు. పేదలు తెలుగు మీడియం లోనే చదవాలనడం వివక్ష కాదా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

Also Read..

Breaking: టీడీపీ కార్యకర్తలతో పాలకుర్తి భేటీ.. సమావేశ సారాంశం ఇదే..

Advertisement

Next Story