ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవాలని జగన్‌ చూస్తున్నారు : మాజీ మంత్రి దేవినేని ఉమా

by Shiva |
ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవాలని జగన్‌ చూస్తున్నారు : మాజీ మంత్రి దేవినేని ఉమా
X

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను సీఎం జగన్ తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, అవన్ని ప్రజాస్వామ్యంలో ఫలించవని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఇవాళ నూజివీడు సబ్‌ జైల్లో ఉన్న తిరువూరు టీడీపీ నాయకులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గా్ల్లో ఇంచార్జీలను మారుస్తూ.. ప్రజా వ్యతిరేకతను అధిగమించాలని జగన్‌ ముప్పుతిప్పలు పడుతున్నాడని పేర్కొన్నారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే ఈడీ లెక్కల ప్రకారం రూ.43 వేల కోట్లను దోచుకున్నట్లుగా తేల్చి లెక్కలు లేని రూ.43 వేల కోట్ల ఆస్తిని జప్తు చేశారని గుర్తు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్య నిషేధం అని చప్పిన జగన్ నూతన మద్యం బ్రాండ్‌లతో ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నాడని పేర్కొ్న్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ వర్కర్లు, ఆశాలు, ఉపాధ్యాయులు చివరికి ఆయన నియమించిన వలంటీర్లు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారని పేర్కొన్నారు. అక్రమంగా దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్‌ చూస్తున్నాడని, ప్రతి ఒక్కరూ ఓటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జగన్ ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా త్వరలో రాష్ట్రంలో రాబోయేది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమేనని అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed