- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics:మూడు రాజధానుల పేరిట జగన్ మోసం:పవన్ కళ్యాణ్
దిశ,ఏలూరు: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారాహి భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపంలా అవుతాయని ఆరోపించారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను రాయించుకుంటారని విమర్శించారు. భవిష్యత్తు కూటమి దేనని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని మాటిచ్చారు.
పోలవరం నిర్వాసితులను ఆదుకునేందుకు ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. తన బాధ్యతగా కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా కోటి రూపాయలు ఇస్తున్నారు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఓటు పేరుతో ప్రజలను జగన్ భయాందోళనలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువతను మత్తుకు బానిస గా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఉద్ఘాటించారు. ప్రచారంలో కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, అంబటి రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Read More..