- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KA Paul : లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన KA పాల్

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanthi Party Cheif KA Paul) టీడీపీ ముఖ్య కీలక నేత నారా లోకేష్(Nara Lokesh) కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించిన పాల్.. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలను ఏకి పారేశారు. లోకేష్ ఏపీలో రెడ్‌బుక్(RED BOOK) పేరుతో చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రెడ్‌బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బుక్ తీశానంటే నువ్వు ఉండవని మాస్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు తీసే బుక్ ఏంటి? ఎంతమంది మీద దాడి చేయిస్తున్నావని మండిపడ్డారు. నిన్ను జైల్లో పెట్టి తీరతా అని హెచ్చరించారు. నీ బాబు జైలుకు వెళ్తాడని చెప్పా.. అన్నట్టే జరిగిందని గుర్తుచేశారు. ఇకనుంచి ఎవరైనా వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడిని అయినా రెడ్ బుక్ పేరుతో టచ్ చేస్తే.. నీ బాబును జైల్లో పెడతా.. నిన్ను జీరోను చేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని పిచ్చోడిలా బిహేవ్ చేయొద్దు.. బీకేర్‌ఫుల్ హితవు పలికారు.
వైఎస్ఆర్(YSR) కాలిగోరు తీయడానికి కూడా లోకేష్ సరిపోడని అన్నారు. మీ నాన్నను వైఎస్ఆర్ ఏమీ చేయకుండా తానే కాపాడానని.. కావాలంటే మీ బాబును కనుక్కో అన్నారు. నా స్పిరిట్యూవల్ పవర్ వాడానో.. వాడు ట్రంప్(Trump) అయినా.. బైడెన్(Baiden) అయినా.. మోడీ(Modi) అయినా దిక్కు లేదని తెలిపారు. జగన్ తన మీద ఎన్నడూ కేసులు పెట్టలేదని, ఎన్నికల ముందు జగన్ తనను కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆయన పిలిస్తే వెళ్తానని తెలిపారు. అపోజిషన్ లేకుండా చేసి చంద్రబాబు(Chandrababu), పవన్(Pavan Kalyan)ను బీజేపీ తొత్తులుగా చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ప్యాకేజి స్టార్లు చిరంజీవి(Chiranjeevi), పవన్ కల్యాణ్, షర్మిల(Sharmila)ను మరిచిపోయి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం ప్రజలకు పిలుపునిచ్చారు.