- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ ధనుంజయ్ రెడ్డి.. ఉల్లంఘనలపై సీరియస్ యాక్షన్..!
దిశ ప్రతినిధి, అమరావతి: కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే పాత వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలు, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు విభాగాల్లో జరిగిన లోపాలు, నిధుల దుర్వినియోగంపై శ్వేత పత్రాలను విడుదల చేయడం కూడా ప్రారంభించారు. అందులో భాగంగా విపరీతంగా ఓవర్ యాక్షన్ చేసిన కొందరు అధికారులు, మరి కొందరు సలహాదారులపై దృష్టి సారించారు. ఇప్పటికే సకల శాఖా మంత్రిగా పేరుపడిన ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్టా రెడ్డి వ్యవహారాలపై ఫిర్యాదులు చేయించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోణంలో గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ కార్యదర్శుల విభాగానికి ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసిన ఆర్.ధనుంజయ రెడ్డిపై దృష్టి సారించారు.
వైఎస్ భారతి పేరు చెప్పి..
ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి అయిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డిల పేరు చెప్పి ఉమ్మడి కడప జిల్లాకే చెందిన ఆర్.ధనుంజయ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై విచారణ ప్రారంభించారు. సాక్షిలో పనిచేస్తూ ప్రభుత్వంలోకి వచ్చిన ఆయన పలు శాఖల్లో జోక్యం చేసుకొని అధికారులపై జులుం చేశారని తెలిసింది.
లక్షల కాపీలు సాక్షి కొనిపించిందే ఆయనే..
వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా వున్న సాక్షి దినపత్రికను లక్షల్లో వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు బలవంతంగా అంటగట్టారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. భారతమ్మ మెప్పు పొందేందుకు, ప్రభుత్వంలో తన పైరవీలు నిరాటంకంగా చేసుకొనేందుకు ధనుంజయ రెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ నిధులతో పేపర్ కొనే దారుణమైన పథకాన్ని అధికారుల మీద వత్తిడితీసుకువచ్చి ప్రవేశపెట్టించారనే సమాచారం మీద వివరాలు రాబడుతున్నారు. వీటి ఆధారంగా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇతర శాఖలపై పెత్తనం
పలు శాఖల్లో ఐఎఎస్ అధికారి ధనంజయ రెడ్డి పేరు, వైఎస్ భారతీ పేర్లు చెప్పి పైరవీలు చేసి కోట్లలో లబ్ధి పొందారన్న దానిపై ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. వీటిల్లో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగాయా? అన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. ఏ మాత్రం అవకాశం వున్నా కేసు బనాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.