ఏపీ డీజీపీ పై వేటు..సీఎం రమేష్ వివాదమే డీజీపీ బదిలీకి కారణమా..?

by Disha Web Desk 18 |
ఏపీ డీజీపీ పై వేటు..సీఎం రమేష్ వివాదమే డీజీపీ బదిలీకి కారణమా..?
X

దిశ ప్రతినిధి, గుంటూరు: జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. గతంలో పలువురు ఎస్పీలను బదిలీ చేసిన కమిషన్ ఈ సారి రాష్ట్ర పోలీస్ దళాల చీఫ్ డీజీపీని వీధుల నుంచి తప్పించింది. ఆదివారం ఏపీ డీజీపీ కే.రాజేంద్ర నాథ్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తక్షణమే ఆయనను వీధుల నుంచి రిలీవ్ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అలాగే సోమవారం ఉదయం 11 గంటలకు డీజీ ర్యాంకు స్థాయి ముగ్గురు అధికారుల పేర్లు పంపాలని సీఎస్ కు సూచించింది. సోమవారం సాయంత్రం కల్లా రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెప్పు కొస్తున్నాయి.

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీకి అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, డిప్యూటీ సీఎం, బూడి ముత్యాల నాయుడుల వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నడిచింది. సీఎం రమేష్ తరపున ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం సొంత ఊరుకు కొందరు వెళ్లారు. అధికారుల అనుమతితో డ్రోన్‌ను కూడా తీసుకు వెళ్లారు. ఐతే డ్రోన్ ద్వారా రెక్కి నిర్వహించి ముత్యాల నాయుడును హతమార్చేందుకు వచ్చారని బీజేపీ నాయకుల పై దాడికి దిగారు. ఆ మేరకు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రమేష్ అక్కడకు వెళ్లారు. అక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో రమేష్ పై కూడా దాడి జరిగింది. చొక్కా చినిగింది.

రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసు డిప్యూటీ సీఎం పై కేసు పెట్టేందుకు సాహసించరు లేదు. పైగా పోలీసు అధికారులు రమేష్ చూస్తుండగానే పోలీసు అధికారులు వచ్చి బూడికి సెల్యూట్ చేశారు. ఇదంతా గమనించిన రమేష్ ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆదివారం అమీత్ షా ధర్మవరం వచ్చారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పోలీసు వ్యవహారాల పై సమగ్రంగా వివరించినట్లు తెలిసింది. దీంతో అమిత్ షా కూడా ఈ వ్యవహారం పై తన శాఖాధికారులు తో మాట్లాడినట్లు తెలిసింది. రమేష్ వివాదమే డీజీపీ బదిలీ కి కారణమని తెలుస్తోంది. కొత్త డీజీపీ గా ఆర్,టీ సి,సి ఏం.డీ ద్వారక తిరుమల రావు ను నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed