తెల్లవారితే NTR ‘దేవర’ విడుదల.. థియేటర్లలో అధికారుల తనిఖీలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-26 08:47:37.0  )
తెల్లవారితే NTR ‘దేవర’ విడుదల.. థియేటర్లలో అధికారుల తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం(Devara movie) రేపు(శుక్రవారం 27-09-2024) విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో థియేటర్లలో అధిక షోలు వేయడంతో పాటు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు గురువారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని దేవర చిత్రం విడుదల అవుతున్న థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు జరిపారు. అయితే సమాధానం ఇవ్వటంలో థియేటర్ యాజమాన్యం తడబడటంతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed