- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దుపై హైకోర్టులో విచారణ.. అసలేం ఏం జరిగిందంటే...!
దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఈసీఐ ఇవ్వడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసు గుర్తు కోసం తొలుత తాను దరఖాస్తు చేశానని.. అయితే ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించదని పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, జనసేన కుమ్మకై ఆ గుర్తును తనకు రాకుండా చేశాయని ఆ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిటిషన్‌లో ఆరోపించారు. అందువల్ల జనసేనకు కేటాయించిన గాజు గ్లాసును రద్దు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అభ్యంతరాలను కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది.
కాగా జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులను ఈ మెయిల్ ద్వారా జనసేన కార్యాలయానికి పంపింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. అయితే ఆ తర్వాత గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సిబంల్‌గా ప్రకటించడం, ఇటీవల జనసేనకు కేటాయించడంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఇప్పటికే ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జనసేన పార్టీ తొలుత దరఖాస్తు చేసిందని.. ఆ తర్వాతనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ దరఖాస్తు చేసిందని పేర్కొంది. తొలుత దరఖాస్తు చేసినందువల్ల జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Read More..
ఆ స్థానం నుంచి పవన్ పోటీ..!.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన