లక్ష కోట్లకు చేరువలో భారతదేశ ఎగుమతులు

by srinivas |   ( Updated:2023-03-30 16:10:30.0  )
లక్ష కోట్లకు చేరువలో భారతదేశ ఎగుమతులు
X

దిశ, ఏపీ బ్యూరో: భారతదేశం ఎగుమతుల్లో ప్రపంచ వేదికపై సత్తా చాటుతూ 750 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో 75వ వసంతంలో ఈ ఘనత సాధించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఈ మేరకు ఎంపీ ట్వీట్ చేస్తూ.. ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవడానికి భారతదేశానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. ఎగుమతి దారులందరికీ అలాగే వీరిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమర్ధ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.


యూపీఐ ద్వారా నిర్వహించు లావాదేవీలపై తప్పుగా అర్థం చేసుకున్న 1.1% చార్జీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అత్యధిక శాతం ప్రజలు చేస్తున్నట్లు ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మరో బ్యాంకు అకౌంట్‌కు లావాదేవీలు నిర్వహించేందుకు యూపీఐ ఉచితంగా అందుబాటులో ఉండాలని వియసాయిరెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed