- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్యాయం జరిగితే పోరాడాలి...లేదంటే తిరగబడాలి : Pawan Kalyan..
దిశ, డైనమిక్ బ్యూరో : అట్రాసిటీ కేసులను వైసీపీ సర్కార్ అడ్డగోలుగా వాడుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. విశాఖలో వారాహి విజయయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్ జనవాని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ భూమలను కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. దువ్వాడలో ఉన్న తమ స్థలాన్ని అమ్మాలంటూ స్థానిక వైసీపీ నేత బలవంతం చేస్తున్నారని పవన్ కల్యాణ్‌కు బాధితులు ఫిర్యాదు చేశాడు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.ప్రత్యర్థి పార్టీలను అణచివేసేందుకు వైసీపీ నాయకులు అట్రాసిటీ కేసులను వాడుతున్నారని ఆరోపించారు. ఈ కేసులను అడ్డం పెట్టుకుని స్థలాలు కబ్జాలు చేస్తున్నారు అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కరోనా సమయంలో వైసీపీ నేతలు భూములు కొల్లగొట్టారన్నారు. భూములు కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భారోసా ఇచ్చారు. బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. అన్యాయం జరిగితే పోరాటం చేయాలి.. లేదంటే తిరగబడాలి అని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రను వైసీపీ నాయకులు అంచెలంచెలుగా విధ్వంసానికి పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారంటూ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కుమార్తెను కోల్పోయిన తల్లి లత జనసేనానికి ఫిర్యాదు చేసింది. ఎల్జీపాలిమర్స్ ఘటనలో కుమార్తెను కోల్పోయిన తాను న్యాయం చేయమని పోరాటం చేసిన సమయంలో గేటు దూకినందుకు తనపై కేసు పెట్టారని ఆరోపించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా.. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఎందుకు రెచ్చిపోతున్నారంటూ మాట్లాడారని ఆమె పవన్ వద్ద గోడు వెల్లబోసుకుంది. పుట్టెదు దుఖంలో ఉన్న తమ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధ కలిగించిందని వాపోయింది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం జరిగితే వైసీపీ నేతలు వెల కడుతున్నారు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఇంకా ఏం కావాలి అని మంత్రి, ఎమ్మెల్యేలు అంటారా? అంటూ మండిపడ్డారు. అన్నం తినేవారు బాధితులతో మాట్లాడే తీరు ఇదేనా అని నిలదీశారు. బిడ్డ చనిపోయిన ఆవేశంతో గోడ దూకితే తల్లిపై తప్పుడు కేసులు పెడతారా? అని ధ్వజమెత్తారు. ఈ అమానుష ఘటనపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికైనా బాధితులపై ప్రభుత్వం కేసులు విత్ డ్రా చేసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.