AP Deputy CM:‘రేషన్ తరలిపోతుంటే.. మీకు బాధ్యత లేదా?’.. అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

by Jakkula Mamatha |   ( Updated:2024-11-29 11:38:04.0  )
AP Deputy CM:‘రేషన్ తరలిపోతుంటే.. మీకు బాధ్యత లేదా?’.. అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: కాకినాడ పోర్టు(Kakinada Port) నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(శుక్రవారం) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice)ను పరిశీలించడానికి కాకినాడ పోర్టుకు చేరుకున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. రేషన్ బియ్యం మాఫియా గత ప్రభుత్వం నుంచి నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి పోర్టులో ఎవరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై ఆయన మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు. ‘ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికే కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్రి, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీ ఎస్ ఓ ప్రసాద్ పై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం సీరియస్ గా ఉన్న క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా లేవని అసహనం వ్యక్తం చేశారు. పోర్ట్‌కి రేషన్ రైస్ వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా మంత్రి వచ్చి చెప్పిన సీరియస్ నెస్ లేదని ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed