- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీమంత్రి కొల్లు రవీంద్ర జోలికి వస్తే ఊరుకోం
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి కొల్లు రవీంద్ర జోలికి వస్తే ఊరుకోం అని టీడీపీ హెచ్చరించింది. టీడీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని.. చంద్రబాబుకు అనుకూలమైన వాళ్లకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపైనా కేసు నమోదు చేసింది. అయితే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రయత్నిస్తుందని ప్రచారం జరిగింది. దీంతో మచిలీపట్నం టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో కొల్లు రవీంద్రపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. తమ నాయకుడి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీసీలపై జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని... కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొల్లు రవీంద్రపై మద్యం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. కులం చూడం, మతం చూడం అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. జీవో ఇచ్చిన అజయ్ కల్లం రెడ్డి ఎలా సచ్ఛీలుడయ్యాడు.. రెడ్డి కులం ఉంటే క్లీన్ చిట్ ఇచ్చేస్తారా..? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
బీసీలంతా చంద్రబాబు వైపే
మద్యంలో లక్ష కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి టీడీపీ నేతలపై కేసు పెట్టడం సిగ్గు చేటన్నారు. బీసీలకు చెందిన రూ.75వేల కోట్లు దారిమల్లించిన దగా కోరు జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. బీసీలను మోకాలిదండ వేయించడం బీసీల సంక్షేమమా? అని నిలదీశారు. 70మంది బీసీ నేతలను హత్య చేయించిన జగన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని విరుచుకుపడ్డారు. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని విరుచుకుపడ్డారు. బీసీల 8వేల ఎకరాల భూములు లాక్కున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.పేదలను పస్తులు పెడుతున్న పెత్తందారు జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ రద్దుతో 16,800పదవులు దూరం చేసిన సైకో జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలను ముందుకు నడిపింది చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. బాబుతోనే బీసీలంతా అడుగేస్తాం..జగన్ రెడ్డి నియంతృత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం అని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.