- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jogi Ramesh : నేను వైఎస్సార్ శిష్యుడిని..ఎవరిని వదిలిపెట్టను : జోగి రమేష్
దిశ, వెబ్ డెస్క్ : నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి(YSR) శిష్యుడినని, నా జోలికి వస్తేవదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh)హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరే వ్యక్తి ఈ జోగి రమేష్ కాదన్నారు. నా జోలికి వస్తారనుకున్నానని, కాని నాకుటుంబంలో నా కుమారుడిపైన కూడా కక్ష సాధింపులకు దిగుతున్నారని కూటమి ప్రభుత్వంపై జోగి మండిపడ్డారు. నా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. .ఈ రోజు నుండి ప్రయాణం మొదలైందని, జనవరిలో మైలవరంలో వైసీపీ కార్యాలయం ప్రారంభిస్తామని తెలిపారు. మాకు కూటములు లేవు, జెండాలు జతకట్టాల్సిన అవసరం లేదని, ఒక్కడే లీడర్, సింగిల్ ఎజెండా అని కీలక వ్యాఖ్యలు చేశారు.
5నెలలు కూడా పూర్తి కాకుండానే కూటమికి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతూ జగనన్న కోసం జనం ఎదురు చూస్తున్నారన్నారు. 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, సిద్దమేనా? అని కూటమి నేతలకు సవాల్ విసిరారు. జగనన్న మాట ప్రకారం 2019 లో సీటు త్యాగం చేసి ప్రక్కకెళ్ళానని, మా మోచేతి క్రింద నీళ్ళు త్రాగి, మా జెండా క్రింద గెలిచి పార్టీ మారిన నేతలు మా జగనన్న ని కారుకూతలు కూస్తార్రా? అని మండిపడ్డారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని, అడగకుండా పెట్టేవాడే జగనన్న అని చెప్పుకొచ్చారు.